దాయాది దేశం పాకిస్థాన్ చేయాల్సిందంతా చేసిసి, తాపిగా తనకేం తెలియదన్నట్లు వ్యవహరిస్తోంది. పాక్ రాజకీయాల్లో సౌమ్యుడిగా పేరొందిన ఆ దేశ ప్రధాని నవాజ్ షరీప్ కూడా ఇప్పుడు అదే చేశాడు. ఐక్యరాజ్యసమితి ప్రసంగంలో భారత్ దేశంపై తనకున్న అక్కస్సును వెల్లగక్కిన ఆయన.. తీరా అంతా ముగిసాక.. భారత ప్రధాన మంత్రికి శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు ప్రకటించారు. పాముతోనే పగ, తోకతో మాత్రం చుట్టరికాన్ని నిలుపుకుంటాం అన్నట్లుంది నవాజ్ షరీఫ్ వ్యవహారశైలి.
ఐక్యరాజ్య సమితి సర్వ సభ్య సమావేశంలోని తన ప్రసంగంలోభారత్ కు శాశ్వత సభ్యత్వం ఇవ్వకూడదని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
అంతటితో ఆగకుండా కాశ్మిర్ అంశాన్ని ప్రస్తావిస్తూ.. భారత్ దురాక్రమణలో కాశ్మీరీలు ఉన్నారన్నారు. కాశ్మీర్ సమస్య పరిష్కారం తమ దేశానికి చాలా కీలకమని తన ప్రసంగం ద్వరా ఐక్యరాజ్యసమితి సాధరణ సభలో చెప్పారు. పాక్ ప్రధాని హోదాలో ఆయన చేసిందంతా భారత్ పై విషాన్ని చిమ్మడమే. ఇందంతా చేసి గంటలు కూడా గడవక ముందే నవాజ్ షరీఫ్.. తాను భారత్ శ్రేయోభిలాషిని అన్నట్లుగా అమెరికా చేరుకున్న ప్రధాని మోడీకి శుభాకాంక్షలు తెలియజేశారు. నరేంద్రమోఃడీతో భేటీ అవుతారా..? అన్న మీడియా ప్రశ్నకు దాటవేత ధోరణిని అవలంభించిన నవాజ్ షరీప్ ఇవాళ సాయంత్రం అమెరికా నుంచి తమ దేశానికి తిరుగు పయనం కానున్నారు.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more